పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అనారోగ్యానికి గురయ్యారన్న విషయం తెలుసుకున్న వెంటనే ఆందోళనకు గురయ్యారు. ఉదయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. వైద్యుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుదర్శన్ రెడ్డి వద్దే ఉండి వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ క్రమంలో కేటీఆర్, హరీశ్ రావు, వినోద్‌తో పాటు జిల్లా నాయకులతోనూ నిరంతరం మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న కేసీఆర్ సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని పార్టీ నాయకత్వానికి కేసీఆర్ (KCR) సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>