Mobile Popup Ad
Mobile Popup Ad

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే భూపతి రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో: రైతు వారోత్సవాల (Rythu Varotsavalu) నేపథ్యంలో జిల్లాస్థాయి మత్స్యశాఖ ప్రగతి, ప్రణాళిక సమావేశం శుక్రవారం నిజామాబాద్​ (Nizamabad)లో జరిగింది. మత్స్యకారులకు బీమా సౌకర్యం, రాయితీపై వాహనాలు, సంఘ భవనంతోపాటు జిల్లాకు కార్పొరేషన్ చైర్మన్​ను కేటాయించాలని మత్స్యకారులు ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మత్స్యకారులకు అనువుగా జిల్లాలో పుష్కలంగా జల వనరులు, చెరువులు ఉన్నాయని, ఇక్కడి నుండే చేప పిల్లల పెంపకం చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

మత్స్యకారులకేకాకుండా ప్రతిఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కింద రూ.5 లక్షలు అందజేస్తామని గుర్తుచేశారు. మత్స్యకారులకు పింఛన్ అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అర్సపల్లిలో మత్స్యకారుల కోసం కేటాయించిన భూమి గతంలో కబ్జాకు గురైందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దానిని కాపాడమన్నారు. వెంటనే సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ అధ్యక్షులు శ్రీనివాస్, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మాజి నరేశ్​, కిరణ్, డివిజన్ నంబర్ 1 కార్పొరేటర్ అగ్గు భోజన్న, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: దీదీకి బిగ్ షాక్… ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన గవర్నర్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>