కలం, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ అక్రమాలతో గెలుపొందిందని, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ భీష్మించుకుని కూర్చున్న మమతా బెనర్జీకి గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) తనకున్న రాజ్యంగపు హక్కుల్ని వినయోగించి చెక్ పెట్టారు. టీఎంసీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. గవర్నర్ తన విచక్షణాధికారాలతో తీసుకున్న తాజా నిర్ణయంతో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు తెరపడింది.
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా ఓడిపోయింది. 294 స్థానాలకు గానూ టీఎంసీ 80 స్థానాలకే పరిమితం అయింది. బీజేపీ ఏకంగా 207 స్థానాల్లో గెలిచి అఖండ విజయాన్ని సాధించింది. మమతా బెనర్జీ తను పోటీచేసిన స్థానంలో కూడా గెలవలేక దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ ఎన్నికలు బీజేపీ అక్రమాలతో గెలుపొందిందని, తాను రాజీనామా చేసేది లేదని మమతా బెనర్జీ ఆరోపించింది.. ఆమె మొండితనంతో గవర్నర్ తాజా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఇదిలాఉంటే మే 9న బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే బెంగాల్ సీఎం ఎవరన్న విషయంపై ఇంకా సస్పెన్స్ నెలకొంది. సీనఎం రేసులో సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. భవానీపూర్ లో మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించారు. దీంతో ఆయన వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ తోషాతో పాటు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
Read Also: తమిళనాడులో గవర్నర్‌దే తుది నిర్ణయం: హెచ్.డి. కుమారస్వామి
Follow Us On: WhatsApp

