కలం, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamil Nadu)లో నెలకొన్న రాజకీయ పరిణామాలపై కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి (Kumaraswamy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్‌దే తుది నిర్ణయం అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని అనుసరించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకునే వారు మేజిక్ ఫిగర్ చేరుకొని తమకు ఉన్న మెజారిటీని నిరూపించుకోవాలని సూచించారు. అప్పుడే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరిస్తారని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు తక్కువగా ఉందని కుమారస్వామి (Kumaraswamy) అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకుకు 118 ఎమ్మెల్యేల మద్దతు కావాలని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇది సాధారణ ప్రక్రియేనని , అయితే విజయ్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు సంపాదించేందుకు ఏం చేస్తారో చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: ప్రధాని సభలో రెండు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు: రామ్‌చందర్‌రావు
Follow Us On: WhatsApp

