రైతు సంక్షేమ‌మే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే బాలు నాయక్

కలం, దేవరకొండ : రైతుల సంక్షేమానికి, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Nenavath Balu Naik) స్పష్టం చేశారు. మంగళవారం దేవరకొండ (Devarakonda) నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద డిండి మండలం ఎర్రారం, దేవరకొండ మండలం కాసారం గ్రామాలకు చెందిన రైతులకు రూ.23,485 విలువైన సూక్ష్మసేద్య పరికరాలను (స్ప్రింక్లర్లు) ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేందుకు మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆధునిక వ్యవసాయ విధానాలను అవలంబించాలని పిలుపునిచ్చారు.

దేవరకొండ పట్టణంలోని 10వ వార్డులో రూ.58 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వార్డులోని పలు కాలనీల్లో పర్యటించి డ్రైనేజీ, రోడ్డు సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని, మిగిలి ఉన్న పనులను కూడా దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 10వ వార్డులోని అయ్యప్ప గుడిలో గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, కొండభీమనపల్లి చెరువు వద్ద రేపు జరగనున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్, విద్యుత్ దీపాలు, రహదారుల సౌకర్యం, భద్రతా చర్యలను పక్కాగా చేపట్లాని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>