కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (Constable Soumya) కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. గత నెల 23న గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో దుండగులు కారుతో ఢీకొట్టడంతో మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. విధి నిర్వహణలో గాజుల సౌమ్య చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సౌమ్య కుటుంబానికి కోటి ఎక్స్ గ్రేషియా ఇస్తామని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ఇటీవలనే సౌమ్య కుటుంబ సభ్యులకు కోటి రూపాయల చెక్కును అందించారు.
సోమవారం సౌమ్య (Constable Soumya) తమ్ముడు గాజుల శ్రవణ్‌కు ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియామక పత్రాన్ని కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి అందించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సౌమ్య కుటుంబానికి కోటి రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగం (Government Job) కల్పించిందన్నారు. సౌమ్య మరణానికి కారణమైన దుండగులను కఠినంగా శిక్షిస్తామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, నోడల్ అధికారి మల్లారెడ్డి, సీఐ స్వప్న, ఎస్సై మల్లేశ్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ యూనియన్ అధ్యక్షుడు రవి, కార్యదర్శి చంద్ర మోహన్ పాల్గొన్నారు.
View this post on Instagram
Read Also: సీఎం క్యాంప్ ఆఫీస్‌కు హై సెక్యూరిటీ.. ఆ వాల్ కోసం రూ. 9 కోట్ల ప్రాజెక్టు!
Follow Us On: X(Twitter)

