Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం క్యాంప్ ఆఫీస్‌కు హై సెక్యూరిటీ.. ఆ వాల్ కోసం రూ. 9 కోట్ల ప్రాజెక్టు!

కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇప్పటివరకూ క్యాంప్ ఆఫీస్ (CM Camp Office) లేదు. జూబ్లీహిల్స్ లోని తన ఇంటినే క్యాంప్ ఆఫీసుగా మార్చుకున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ – MCRHRD) ఆవరణలో క్యాంప్ ఆఫీస్‌ను పెట్టుకోడానికి సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పరిశీలన చేశారు. ఇప్పుడు ఆ క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఎత్తయిన కాంపౌండ్ వాల్‌ను నిర్మించేలా నిర్ణయం  జరిగింది. సుమారు తొమ్మిది కోట్ల రూపాయలతో ప్రహరీ గోడతో పాటు దానికి హై సెక్యూరిటీ హంగులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రహరీగోడకు వాచ్ టవర్లు, గోడకు పై భాగంలో కన్సెర్టినా వైర్, భారీ గేట్లు, ఫర్నీచర్, సెక్యూరిటీ ఏర్పాట్లు, అప్రోచ్ ర్యాంప్, అక్కడి వీవీఐపీ గెస్ట్ హౌజ్‌కు వెళ్ళేందుకు పశ్చిమం వైపు రోడ్డు నిర్మాణం.. ఇలాంటివన్నీ సమకూర్చాలని భావించింది.

ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో టెండర్లు :

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ (CM Camp Office) నిర్మాణానికి వీలుగా రోడ్లు భవనాల శాఖ టెండర్లను ఆహ్వానించింది. మొత్తం రూ. 9.08 కోట్ల విలువైన పనులకు మార్చి 4వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించేందుకు గడువు ఇచ్చింది. తొలుత టెక్నికల్ బిడ్‌లను చివరి రోజు (మార్చి 4న) పరిశీలించి 6వ తేదీన ఎవరు తక్కువ కోట్ చేశారో ఆ సంస్థను ఆర్ అండ్ బీ శాఖ అధికారులు గుర్తించనున్నారు. రెండేండ్ల వ్యవధిలో టెండరులో పేర్కొన్న మొత్తం పనులు పూర్తయ్యేలా గడువును అధికారులు నిర్దేశించారు. అప్పటికల్లా అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చేస్తాయి. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంపూర్ణ ధీమాతో ఉన్నందున సెకండ్ టర్ములో ఆ భవనం ఆయనకు కార్యక్షేత్రంగా మారనున్నది.

Read Also: జిల్లాల్లో కాంగ్రెస్ జెండా.. క్యాబినెట్ మరో బిగ్ డెసిషన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>