Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళపై లైంగిక దాడికి యత్నించిన కాంగ్రెస్ నేత

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట‌(Siddipet)లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ నేత సాయి ప్రతాప్ ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో అతడిని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పెనుగులాటలో బాధితురాలికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధిత మహిళ భరోసా కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు.

నిందితుడి ఓవర్ యాక్షన్

విషయం బయటకు పొక్కడంతో సదరు కాంగ్రెస్ నేత మరింత రెచ్చిపోయాడు. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను బెదిరించినట్టు సమాచారం. కాంగ్రెస్ ముఖ్య నాయకుల పేరు చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారటంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలకు ఉపక్రమించింది. సాయి ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్టుగా కాంగ్రెస్ ప్రకటించినది. ఎన్ఎస్‌యూఐ పట్టణ అధ్యక్ష పదవిని రద్దు చేశారు. ఈ మేరకు సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యం మాముద్దిన్ (అత్తూ) పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. నిజానిజాలు వెలుగులోకి వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పార్టీ పేర్కొన్నది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>