కలం, నిజామాబాద్ బ్యూరో: ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్షాలతో కలిసి అక్టోబర్ 7వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టబోతున్నామని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి (Katipally Nagesh Reddy) తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు.
ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తొత్తుగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. సర్ ప్రోగ్రాంలో కొన్ని లక్షల మంది ఓట్లు తొలగించారని, వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు తీసుకుంటాయని తెలిపారు.
మూడు రోజుల పాటు ఆందోళనలు..
కాటిపల్లి నగేష్ రెడ్డి (Katipally Nagesh Reddy) మాట్లాడుతూ.. సోమవారం, మంగళవారం మండల కేంద్రాల్లో ధర్నా కారక్రమాలు నిర్వహిస్తామన్నారు. బుధవారం రోజు జిల్లా కేంద్రంలో భారీ ఆందోళన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ ఛైర్మన్ శేఖర్ గౌడ్, సీపీఐ ఎంఎల్ వనమాల కృష్ణ , ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు సీపీఐ ఎంఎల్ నగర కార్యదర్శి సుధాకర్ సయ్యద్ ఫిరోజ్ అలీ, రఘురాం, పిట్ల నరేష్ పాల్గొన్నారు.
Also Read : ఆర్చరీలో నీరజ్ సత్తా.. కాంస్యం సొంతం!
Follow Us On: Instagram

