రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 17 మంది దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : రష్యాలోని  సైబీరియా ప్రాంతం కెమెరోవో సమీపంలో ఘోర విమాన ప్రమాదం (Russia Plane Crash) చోటుచేసుకుంది. మంగళవారం యాగునోవో గ్రామానికి చేరువలో రష్యా సైన్యానికి చెందిన ఏఎన్-12 ఫ్లైట్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న 17 మంది సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.

సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాల్లో ఉండగానే విమానంలో మంటలు చెలరేగడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే విమాన ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై రష్యా, విమానయాన శాఖ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>