రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి.. నాయకుల పిలుపు

కలం,‌ జోగులాంబ గద్వాల: హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections) నేపథ్యంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విస్త్రతంగా చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటి మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ సన్నాహక సమావేశం

ఈ నేపథ్యంలో శనివారం జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గద్వాల నియోజకవర్గ బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హన్మంతు నాయుడు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటి మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, మాజీ జెడ్పీటీసీలు పద్మావెంకటేశ్వర్ రెడ్డి, బాసు శ్యామల, కౌన్సిలర్లు, నాయకులు హాజరయ్యారు.

ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది..

ఈ సందర్భంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్, బాసు హనుమంతు నాయుడు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు (Graduate MLC Elections) రాబోయే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటివని పేర్కొన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోవడంతో వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని అభిప్రాయపడ్డారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు ప్రతి గ్రామానికి ఒక ఇన్‌చార్జిని నియమించి అర్హులైన పట్టభద్రులను పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేయించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో తెలంగాణ వెనుకబడిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, మెగా డీఎస్సీ, జీవో 46 రద్దు, రాజీవ్ యువ వికాసం వంటి హామీలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

ప్రతి మండలంలో ఓటరు నమోదు కేంద్రాలు

ఇకపై వినతిపత్రాలు ఇవ్వడం కాకుండా ఎన్నికల ద్వారా తమ సమస్యలపై ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని పట్టభద్రులకు వారు పిలుపునిచ్చారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతి మండలంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అర్హులైన పట్టభద్రులు వాటిని వినియోగించుకుని ఓటర్లుగా నమోదు కావాలని సూచించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, జి. రాఘవేంద్ర రెడ్డి, కుర్వ పల్లయ్య, కౌన్సిలర్లు చిత్తరి మంజుల రాణి కిరణ్, కమ్మరి సునీత రాము, లత రామకృష్ణ, పులిపాటి వెంకటేష్, చంటన్న, గువ్వల గోపాల్, దుబన్న, మోహన్ యాదవ్, నరసింహులు, సర్పంచులు సాకి డేవిడ్, తిమ్మప్ప, నాయకులు కోటేష్, పటేల్ జనార్దన్ రెడ్డి, ఆతుకూరి రెహమాన్, లక్ష్మీకాంత్ రెడ్డి, చక్రధర్ రెడ్డి, అంగడి బసవరాజ్, మోనేష్ మరోజు, గోపాల్, యూసఫ్, ప్రతాప్, భరత్, వీరారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎస్. రాము, గంజిపేట రాజు, నాగరాజు, రామకృష్ణ, బొప్పాల శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు.

Also Read : ఆర్చరీలో నీరజ్ సత్తా.. కాంస్యం సొంతం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>