కలం, స్పోర్ట్స్: భారత ఆర్చర్ నీరజ్ చౌహాన్ (Neeraj Chauhan) అదరగొట్టాడు. ఆసియా క్రీడల్లో పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. శనివారం జరిగిన ఆల్-ఇండియా పోరులో తోటి ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను 6-4తో ఓడించాడు. మ్యాచ్‌ను నీరజ్ ఘనంగా ప్రారంభించాడు. తొలి సెట్‌లో 29-26తో ధీరజ్‌ను ఓడించాడు. దీంతో 2-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. నీరజ్ 10, 9, 10 స్కోర్లు సాధించాడు. రెండో సెట్‌లో ధీరజ్ పుంజుకున్నాడు. 28 పాయింట్లు సాధించాడు. నీరజ్ 27కే పరిమితమయ్యాడు. దీంతో ధీరజ్ 2-0తో సెట్ గెలిచాడు. స్కోరు 2-2గా సమమైంది.
మూడో సెట్‌లోనూ ధీరజ్ పైచేయి సాధించాడు. ధీరజ్ 29 పాయింట్లు కొట్టగా.. నీరజ్ 28 పాయింట్లు సాధించాడు. దీంతో ధీరజ్ 4-2 ఆధిక్యంలోకి వెళ్లాడు. కాంస్యం కోసం మరో సెట్ గెలిస్తే చాలు అనే స్థితికి చేరుకున్నాడు. అయితే నాలుగో సెట్‌లో నీరజ్ అదరగొట్టాడు. వరుసగా 10, X, 10 కొట్టాడు. మొత్తం 30 పాయింట్లు సాధించాడు. ధీరజ్ 28 పాయింట్లకే పరిమితమయ్యాడు. దీంతో నీరజ్ 2-0తో సెట్ గెలిచాడు. మ్యాచ్ స్కోరు 4-4గా సమమైంది.
ఇక చివరి సెట్ కాంస్య పతకాన్ని నిర్ణయించింది. నీరజ్ (Neeraj Chauhan) ఒత్తిడికి తలొగ్గలేదు. 10, 9, 10తో మొత్తం 29 పాయింట్లు సాధించాడు. ధీరజ్ 8, 10, 10తో 28 పాయింట్లు కొట్టాడు. ఒక్క పాయింట్ తేడాతో చివరి సెట్‌ను నీరజ్ సొంతం చేసుకున్నాడు. దీంతో 6-4తో మ్యాచ్‌ను గెలిచి కాంస్య పతకం దక్కించుకున్నాడు.
Also Read : పైలట్ స్మిత్ మచ్ఛర్‌కు రూ.కోటి నజరానా
Follow Us On : WhatsApp

