కలం, కరీంనగర్ : ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో(Alugunur) నిర్వహించనున్న దీక్షా దివస్(Deeksha Diwas) భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సభ ఇన్చార్జులను నియమించింది. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జిగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, చొప్పదండి ఇన్చార్జిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి, వేములవాడ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సిరిసిల్ల ఇన్చార్జిగా ఎమ్మెల్సీ ఎల్. రమణ, పెద్దపల్లి ఇన్చార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, కరీంనగర్ ఇన్చార్జిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, హుజూరాబాద్ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులను పార్టీ నియమించింది.
నియమితులైన ఇన్చార్జులు తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ దీక్షా దివస్ సభకు జనసమీకరణ చేయనున్నారు. సభను విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై దృష్టి సారించనున్నారు.

