బీమా పథకాలన్నీ ఒకే గొడుకు కిందకు.. సీఎం కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా సౌకర్యం కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల్లో అమలవుతున్న బీమా పథకాలను (Indiramma Bima Scheme) ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆదేశించారు. సిద్ధిపేట బహిరంగ సభలో ఈ నెల 19న ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణను సీఎం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

బీమా పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఇప్పటికే అమలవుతున్న వివిధ రకాల బీమా పథకాల్లో జీవిత బీమా కింద రెండు లక్షలు, ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయల వరకు అందిస్తున్నట్లు సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. ఈ బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి, వారికి లభిస్తున్న ప్రమాద బీమా ప్రయోజనాలను కొనసాగించేలా చర్యలు తీసుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>