Mobile Popup Ad
Mobile Popup Ad

ఈ నెల 20న జాతీయ లోక్ అదాలత్

కలం, నిజామాబాద్ బ్యూరో: న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకొనేందుకు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌ (Lok Adalat)ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ఈనెల 20న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారని చెప్పారు. చిన్న చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారించుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా ఇది ఒక శాంతియుత పరిష్కార విధానం కాబట్టి ఇరు పక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కోర్టులో గల కేసులలో త్వరగా పరిష్కారం చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>