కలం, తెలంగాణ బ్యూరో : బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (Nitin Nabin) పేరు దాదాపుగా ఖరారైంది. ప్రస్తుతం ఆయన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. సంస్థాగత ఎన్నికల ద్వారా కొత్త అధ్యక్షుడిని జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎన్నుకుంటారు. ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఆ మరుసటి రోజున లాంఛనంగా అధ్యక్షుడి పేరును పార్టీ ప్రకటిస్తుంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోడానికి ఈ నెల 19న నామినేషన్ల ప్రక్రియ జరగనున్నది. అదే రోజున నితిన్ నబిన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బహుశా ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా ఇంకెవరూ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేదన్నది పార్టీ జాతీయ నాయకుల సమాచారం.
నామినేషన్ దాఖలు చేసిన రోజే ఎన్నిక ప్రక్రియ కూడా జరుగుతుంది. ఎలక్షన్ ప్రాసెస్ పై పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ జరిగింది. సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, అరుణ్‌సింగ్, తరుణ్‌చుగ్ తదితరులు ఈ ఎన్నికపై డిస్కస్ చేశారు. నామినేషన్ పత్రాల పరిశీలన, ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం నితిన్ నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు ఒకరు తెలిపారు.
బీహార్‌కు చెందిన నితిన్ నబిన్ ఊ6) దాదాపు ఇరవై ఏండ్లుగా దశాబ్దాలుగా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. పార్టీలో యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో నితిన్ పేరును సీనియర్ నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. దానికి ముందస్తు సంకేతంగా ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ నియమించింది. గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత ఆ రాష్ట్ర క్యాబినెట్‌లో ఉన్నారు. చత్తీస్‌గఢ్ ఎన్నికల ఇన్‌ఛార్జిగా పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించినట్లు పార్టీ గతంలోనే ప్రకటించింది. ఆర్ఎస్ఎస్ (RSS)తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆయనకు సపోర్టుగా ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. లాంఛనంగా కొత్త అధత్యక్షిడిగా నితిన్ నబిన్ పేరును ప్రకటించడంతో బీజేపీ కొత్త శకానికి ప్రారంభం చుడుతుందని, రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు మూడేండ్ల తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికలు కూడా ఆయన మార్గదర్శకత్వంలోనే జరుగుతాయని వివరించాయి. బీజేపీ చరిత్రలోనే అతి పిన్న వయసులో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నితిన్‌కు (Nitin Nabin) గుర్తింపు లభించినట్లవుతుంది.
Read Also: గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. 10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ ఎత్తివేత
Follow Us On: X(Twitter)


