కలం, సినిమా : కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) కేజీఎఫ్ సిరీస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలతో యశ్ పాన్ ఇండియా వైడ్ బాగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం యశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’. ఈ మూవీ కోసం యశ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ (Toxic Teaser) వివాదాస్పదంగా మారింది. ఈ టీజర్‌లో అశ్లీల సీన్లు ఉన్నాయని ఆరోపిస్తూ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆప్ రాష్ట్ర యూనిట్ మహిళా విభాగం నాయకులు రాష్ట్ర మహిళా కమిషన్ అధికారులను కలిసి, టీజర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. కార్యదర్శి ఉషా మోహన్ సమర్పించిన పిటిషన్‌ను మేరకు కమిషన్ కార్యదర్శి సీబిఎఫ్‌సి (CBFC) కు లేఖ రాశారు. యూట్యూబ్‌లో విడుదల చేసే టీజర్స్‌కు (Toxic Teaser) సెన్సార్ సర్టిఫికేట్ అవసరం లేదని తాజాగా CBFC తెలిపింది. థియేటర్స్‌లో ప్రదర్శించే సినిమాలకే సెన్సార్ పర్మిషన్ అవసరం అని యూట్యూబ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ కావడంతో తమ పరిధిలోనికి రాదని తేల్చి చెప్పింది.
Read Also: కాబోయోవాడు ఎలా ఉండాలో చెప్పిన మీనాక్షి
Follow Us On : WhatsApp


