సంగారెడ్డిలో రాజీవ్ గాంధీ విగ్రహానికి నిర్మల జగ్గారెడ్డి నివాళి

కలం, మెదక్ బ్యూరో: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి (Sangareddy) పట్టణంలో టీజీఐఐసీ ఛైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి స్థానిక రాజీవ్ పార్కులో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు. యువతకు అవకాశాలు కల్పించడంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , సాంకేతిక రంగ అభివృద్ధికి పునాది వేయడంలో రాజీవ్ కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>