నీట్‌లో 487 మార్కులు.. విద్యార్థికి ఘన సన్మానం

కలం, నిర్మల్​ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్‌కు చెందిన లతీఫ్ అహ్మద్ కుమారుడు శేక్ జైద్ అహ్మద్ (Zaid Ahmed) నీట్–2026 ప్రవేశ పరీక్షలో 487 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు. వైద్య విద్యలో ప్రవేశం సాధించాలనే లక్ష్యంతో కృషి చేసిన జైద్ అహ్మద్ విజయంపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థి ప్రతిభను అభినందిస్తూ ఆదివారం భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ బీబీ ఖుతిజ సిద్ధిఖ్ (ఇద్రీస్ బేగ్) ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే పట్టుదలతో ముందుకు సాగి వైద్య విద్యలో సీటు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, స్థానికులు విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Read Also: నిర్మల్ జిల్లాలో ‘కారు’ స్టీరింగ్ పట్టేది ఎవరు?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>