లక్కవరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

కలం, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ (Konaseema) జిల్లా మల్కిపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. లక్కవరం (Lakkavaram) శివారు ఓఎన్జీసీ సైట్ వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అన్నదమ్ములు ముదునూరి రామభద్ర రాజు(55), వెంకటసుబ్బరాజు(52) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వీరి భార్యలు విజయలక్ష్మి, శారదలను చికిత్స నిమిత్తం అమలాపురం ఆసుపత్రికి తరలించారు. వీరు లక్కవరానికి చెందిన వారుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>