కలం, వెబ్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ (Yogi Adityanath) కాన్వాయ్ రోడ్డుపై వెళ్తుండగా పేలుడు జరగడం తీవ్ర కలకలం రేపింది. నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మధురలో నిర్వహిస్తున్న వేడుకలకు సీఎం యోగి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఉదయం మధురకు బయలుదేరారు. మార్గ మధ్యలో యోగి పర్యటనలో భద్రతా లోపం కలకలం రేపింది.
మధురలో సీఎం యోగి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి హోటల్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో చేతన్య విహార్ హోటల్ వద్ద ఆయన కాన్వాయ్ వెళ్తుండగా పైన ఉన్న విద్యుత్ తీగల్లో పేలుడు సంభవించింది. భారీగా శబ్దం రావడంతో పాటు మెరుపులు వచ్చాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సీఎం, అధికారులు అక్కడి నుంచి సురక్షితంగా ముందుకు వెళ్లారు.

