ట్రాఫిక్ సమస్యకు చెక్: నిర్మల్ పోలీసుల స్పెషల్ ప్లాన్!

కలం, నిర్మల్ : నిర్మల్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నివారణకు జిల్లా పోలీసు (Nirmal Police) శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. బస్టాండ్ పరిసరాలు, మయూరి హోటల్ జంక్షన్, మంచిర్యాల చౌరస్తా, ఈద్గాహ్ చౌరస్తా ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా పరిశీలించారు.

అనంతరం ఎస్పీ ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్టాండ్, మినీ ట్యాంక్ బండ్ సమీపంలో రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని హెచ్చరించి తోపుడు బండ్లను తొలగించారు. వాహనదారులు పోలీసులకు సహకరించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ఇందులో పట్టణ సీఐ సమ్మయ్య, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>