పోలీసుల సేవలు చిరస్మరణీయం: అదనపు ఎస్పీ

కలం, నిర్మల్: ప్రజల భద్రత కోసం జీవితాన్ని అంకితం చేసి, పోలీసు శాఖకు విశిష్ట సేవలందించిన సిబ్బంది సేవలు చిరస్మరణీయమని అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి అన్నారు. పదవీ విరమణ పొందిన మామడ ఎస్సై హన్మండ్లు, డీఏఆర్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జ్యోతిరామ్‌లను శనివారం నిర్మల్ (Nirmal) జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించి శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం వారు అందించిన సేవలు పోలీసు శాఖకు గర్వకారణమన్నారు. వారి అనుభవం, అంకితభావం యువ పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు గోవర్ధన్ రెడ్డి, సమ్మయ్య, ఎస్సైలు లింబాద్రి, గోపి, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>