ఈసీపై కాంగ్రెస్‌వి నిరాధార ఆరోప‌ణ‌లు: రామాంజ‌నేయులు

కలం, జోగులాంబ‌ గద్వాల: కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని జోగులాంబ‌ గద్వాల జిల్లా (Jogulamba Gadwal) బీజేపీ అధ్యక్షుడు రామాంజనేయులు (BJP President Ramanjaneyulu) తీవ్రంగా విమర్శించారు. శనివారం గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ అనేది ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చట్టబద్ధంగా, అత్యంత పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని వివ‌రించారు.

తుది ఓటర్ల జాబితా ఇంకా విడుదల కాకముందే ఓట్లు తొలగించారంటూ ఆరోపణలు చేయడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ధ్వజమెత్తారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా సహకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ స‌మావేశంలో రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ బండల వెంకట రాములు, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి అక్కల రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావ్, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ నరసింహ, మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మాలిమ్ ఇసాక్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దాస్, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, కౌన్సిలర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>