​అచీవర్స్ స్కూల్‌లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

కలం, కరీంనగర్: కరీంనగర్ లోని స్థానిక కోతిరాంపూర్ లోని అచీవర్స్ ఆక్టివ్ పాఠశాలలో (Achievers School) శ్రీ కృష్ణాష్టమి ముగింపు వేడుకలు, ఉపాధ్యాయ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సి.హెచ్. పల్లవిలతో కలిసి ముఖ్యఅతిథి, అలయన్స్ క్లబ్ బాధ్యులు ఇంజనీర్ కోల అన్నా రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ​అనంతరం విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, నాటికలు శ్రీకృష్ణుని లీలలను, కృష్ణ జన్మ ఇతివృత్తాన్ని కళ్ళకు కట్టినట్టు ఆకట్టుకున్నాయి.

విద్యార్థుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా మాతృమూర్తులకు నిర్వహించిన ‘ఉట్టి’, ‘వెన్నకుండ అలంకరణ’ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ​ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించి, వారిని శాలువా, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ​

ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని కొనియాడారు. ప్రిన్సిపాల్ పల్లవి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది, వారి భవిష్యత్తుకు దిక్సూచిలా నిలుస్తారని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>