కలం, వెబ్ డెస్క్: తమిళనాడులోని కడలూరుకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
రామనత్తం-తిట్టకుడి గ్రామాల మధ్యలో ఆర్టీసీ బస్సు రెండు కార్ల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో (Tamil Nadu accident) తొమ్మిది మంది మృతిచెందారు. తిరుచ్చి నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. బస్సు రెండు కార్ల మీదకు దూసుకుపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. టైర్లు పేలిపోయిన తర్వాత బస్సు కంట్రోల్ తప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ను దాటి అవతలివైపు రోడ్డుపై వెళ్తున్న కార్లను ఢీకొట్టినట్లు తెలిపారు. రెండు కార్లలో ప్రయాణిస్తున్న తొమ్మిది మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏడుగురు మృతి చెందగా ఆ తర్వాత ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మరో ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం


