epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు

కలం, వెబ్ డెస్క్ : ఈ నెల 29 నుంచి అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు జరగబోతున్నాయి. 29న ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో గోదావరి, కృష్ణా జలాల మీదే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నీటి వాటాలు కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ లో ఉన్న అంశాల మీద చర్చ జరగనున్నది. మరి ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్‌తో అన్ని విషయాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది ఇప్పటికే ప్రకటించారు. నీళ్లు, నియామకాలు, ప్రభుత్వ పథకాలు ఏ అంశంమీదైనా తాము చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>