epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఏపీలో డ్రోన్ల ద్వారా మెడిసిన్​ సప్లై

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ ఆరోగ్యశాఖలో కీలక అడుగు ముందుకు పడింది. అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేసేందుకు మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు మందులు, వ్యాక్సిన్ల సరఫరా చేయడానికి డ్రోన్​లను (Drone Medicine Delivery ) వినియోగించనుంది.

అల్లూరి సీతారామారాజు జిల్లా పాడేరు కేంద్రంగా ఈ డ్రోన్​ మెడిసిన్​ డెలివరీ సేవలను నిర్వహించేందుకు ఏపీ ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యచరణను రూపొందించింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం జనవరి నంచి గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు డ్రోన్ల ద్వారా అత్యవసరం మెడికల్​ సామాగ్రి, మందులు, వ్యాక్సిన్లు, రక్త యూనిట్లు సప్లయిని అధికారికంగా ప్రారంభించనుంది.

పాడేరు నుంచి 60 – 80 కి.మీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటి హెల్త్​ సెంటర్లకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తాయి. మందుల సప్లై మాత్రమే కాకుండా రక్తం, మలం, మూత్ర శాంపిళ్లను పరీక్షల కోసం రవాణా చేస్తాయి. ఈ డ్రోన్లు రెండు కిలోల వరకు బరువును మోయగలుగుతాయి. వీటిలో కోల్డ్​ – చైన్​ సౌకర్యాలు ఉండడంతో మందులు, వ్యాక్సిన్లు పాడవకుండా ఉంటాయి. Drone Medicine Delivery సేవలతో దూరప్రాంతంలో ఉన్న ప్రజలకు అత్యవసర మెడికల్​ అవసరాలు అందుతాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>