కలం వెబ్ డెస్క్ : తన కూతురిని చంపిన వాడ్ని కఠినంగా శిక్షించాలని అమెరికాలో హత్యకు గురైన నిఖిత గోడిశాల (Nikitha Godishala) తండ్రి ఆనంద్ పోలీసులను కోరాడు. కొలంబియాలోని మేరీల్యాండ్ (Maryland) లో స్నేహితుడు అర్జున్ శర్మ (Arjun Sharma) చేతిలో నిఖిత డిసెంబర్ 31న హత్యకు గురైంది. అర్జున్ శర్మను పోలీసులు తమిళనాడులో (Tamilnadu) అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిఖిత తండ్రి ఆనంద్ మీడియాతో మాట్లాడారు. తన బిడ్డను చంపిన వాడిని కఠినంగా శిక్షించాలని కోరారు. నిఖిత మృతదేహాన్ని త్వరగా తమకు ఇప్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విన్నవించుకున్నారు.
చివరగా నిఖిత డిసెంబర్ 31వ తేదీన హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసిందని, ఆ తర్వాత ఇక మాట్లాడలేదని చెప్పారు. ఒకప్పుడు నిఖిత, అర్జున్ రూమ్ మేట్స్ అని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో మాజీ ప్రియుడు అని తన కూతురిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కోసమే తన బిడ్డను చంపేసి, కంప్లైట్ ఇచ్చి అర్జున్ పారిపోయాడని పేర్కొన్నారు.

Read Also: సిద్దిపేటలో విషాదం.. జూనియర్ డాక్టర్ ఆత్మహత్య
Follow Us On: Youtube


