కలం, వెబ్ డెస్క్ : రెండు రాష్ట్రాలు అన్ని విషయాల్లో కలిసి ముందుకు వెళ్లాలన్నారు సీఎ చంద్రబాబు నాయుడు. గుంటూరులో జరిగిన తెలుగు ప్రపంచ మహాసభల్లో సీఎం చంద్రబాబు (Chandrababu) పాల్గొని మాట్లాడారు. తెలుగు వారంతా ఒకప్పుడు ఒకే రాష్ట్రంలో ఉండేవారు. ఆ తర్వాత తెలంగాణ, ఏపీగా విడిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అన్ని విషయాల్లో తెలుగువారు కలిసే ఉండాలి. నేనెప్పుడూ తెలుగు వారి అభివృద్ధి గురించే ఆలోచించాను. తెలుగు వారి కోసం సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉండి ఎంతో చేశారు. ‘నాగార్జున సాగర్ లో ఉండే కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవడానికి ఎస్ ఎల్ బీసీ, ఎస్ ఆర్ బీసీ తీసుకొచ్చి సాగునీటికి దారి చూపించింది ఎన్టీఆరే.
ఆ తర్వాత నేను సీఎంగా ఉఉన్నప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, నెట్టెంపాడు, ఏఎంఆర్ ఎత్తిపోతల పథకం తెలంగాణ ప్రాంతంలో పూర్తి చేశాను. కృష్ణా డెల్టా మాడరైడేషన్ పేరుతో 20 టీఎంసీల నీటిని పొదుపు చేసి తెలంగాణకు కేటాయించిన ఘనత నాదే. అలాగే గోదావరిపై గుప్తా, అలీ సాగర్, దేవాదుల ప్రాజెక్టు చేపట్టాం’ అని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.
రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా, గోదావరి నదులు అందుబాటులో ఉన్నాయని.. పోయిన ఏడాది 6282 టీఎంసీ నీళ్లు గోదావరి, కృష్ణా నుంచి సముద్రంలోకి వెళ్లాయని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ‘గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే గోదావరి నీళ్లు వాడుకుంటే నేనెప్పుడూ తప్పు బట్టలేదు. విభజన తర్వాత కాళేశ్వరం కట్టినప్పుడు కూడా నేను అడ్డు చెప్పకుండా ముందుకెళ్లాను. గడచిన 40 ఏళ్లలో 3వేల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాబోతోంది. కృష్ణా, గోదావరి అనుసంధానం జరుగుతోంది.
ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసేది మన దేశమే. నా కల ఒక్కటే గంగా, కావేరి కలవాలి.. దేశంలో నీటి సమస్య పోవాలి. అదే టైమ్ లో ఏపీలో ఉండే నదులన్నీ కలపాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు.. సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. నీటి, ఇతర విషయంలో రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి. తెలుగు వారందరూ కలిసే ముందుకు వెళ్లాలి. ఆ మేరకు అందరికీ ఐకమత్యం అవసరం’ అని చంద్రబాబు నాయుడు వివరించారు.

Read Also: నా బిడ్డను చంపిన వాడ్ని కఠినంగా శిక్షించండి : నిఖిత తండ్రి ఆనంద్
Follow Us On: X(Twitter)


