కలం వెబ్ డెస్క్ : ఇటీవల అమెరికాలో స్నేహితుడి చేతిలో హత్యకు గురైన హైదరాబాద్(Hyderabad) యువతి నిఖిత గోడిశాల(Nikhita Godishala) మృతదేహం శుక్రవారం ఉదయం స్వస్థలానికి చేరుకుంది. నిఖిత స్నేహితుడు అర్జున్ శర్మ(Arjun Sharma)కు ఇచ్చిన డబ్బు విషయంలో గొడవ కాస్తా హత్యకు దారితీసింది. కొలంబియాలోని మేరీల్యాండ్(Maryland)లో అర్జున్ నిఖితను డిసెంబర్ 31న కత్తితో పొడిచి హత్య చేసి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇంటర్‌పోల్(Interpol) తమిళనాడు(Tamil Nadu)లో అర్జున్‌ను అరెస్ట్ చేసింది. అనంతరం విచారణలో ఆర్థిక వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు తేలింది. నిఖిత ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకే అర్జున్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిఖిత తండ్రి ఆనంద్ తన కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకున్నారు. అధికారులు, పాలకుల చొరవతో నిఖిత మృతదేహం ఇంటికి చేరుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు హత్యకు గురవడంతో నిఖిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆనంద్ నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.


