కలం వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ది రాజాసాబ్(Raja Saab) మూవీ భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చింది. మారుతి తెరకెక్కించిన ది రాజాసాబ్ సినిమాపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయితే.. మంచి లాభాలు వస్తే.. ఇంత వరకు ఈ సంస్థకు వచ్చిన నష్టాలన్నీ పోయి లాభాల్లోకి వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అసలు రాజాసాబ్ బడ్జెట్ ఎంత అయ్యింది..? నాన్ థియేట్రికల్ ఎంత వచ్చింది..? అసలు రాజాసాబ్ టార్గెట్ ఎంత..?
రాజాసాబ్ మూవీకి దాదాపుగా 450 కోట్లు బడ్జెట్ అయ్యిందని సమాచారం. ప్రభాస్ రెమ్యూనరేషన్ 120 కోట్లకు పైనే ఉంటుంది. అందుచేత అంత బడ్జెట్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓటీటీ, నాన్ థియేట్రికల్ నుంచి దాదాపు 200 కోట్లు వచ్చింది. మరో 250 కోట్లు రావాలి. అంటే.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కనీసం 400 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇదే ఇప్పుడు రాజాసాబ్ టార్గెట్. విజయ్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం.. ఇది సంక్రాంతి సీజన్ కావడం.. ఈ సీజన్ లో ఫస్ట్ రాజాసాబ్ వస్తుండడం.. ఇదంతా బాగా కలిసొచ్చే ఛాన్స్ ఉంది.
ఇప్పుడు రాజాసాబ్ కు టాక్ యావరేజ్ అని వచ్చింది. ఫస్ట్ డే ఖచ్చితంగా 100 కోట్ల పైనే వస్తాయని టాక్ వినిపిస్తోంది. నార్త్ లో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ.. రాజాసాబ్ టార్గెట్ ను ఈజీగా రీచ్ అవుతాడా లేదా అనేది ఆసక్తిగా మారింది. మరి చూడాలి రాజాసాబ్ ఎంత కలెక్ట్ చేస్తాడో..?


