త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం.. ఫైల్స్ ద‌గ్ధం

క‌లం వెబ్ డెస్క్‌ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా(NTR District) కంచిక‌ర్ల త‌హ‌సీల్దార్ కార్యాల‌యం(Tahsildar Office)లో గురువారం రాత్రి అగ్నిప్ర‌మాదం(Fire Accident) చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో కార్యాల‌యంలోని రికార్డ్స్ గ‌దిలో ఉన్న‌ ఫైళ్లు ద‌గ్ధ‌మ‌య్యాయి(Records Burnt). చుట్టుప‌క్క‌ల నివ‌సించే వాళ్లు మంట‌ల‌ను గుర్తించి అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంట‌ల‌ను అదుపుచేశారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్తమవుతున్నాయి. ప్ర‌మాదవ‌శాత్తు షార్ట్ స‌ర్క్యూట్‌ జ‌రిగిందా? లేక ఎవ‌రైనా ఉద్దేశ్య‌పూర్వ‌కంగా చేశారా? అనే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. మంట‌లు ఆర్పిన త‌ర్వాత అగ్నిమాప‌క సిబ్బంది కాలిపోయిన ఫైళ్ల‌ను బ‌య‌ట‌ప‌డేశారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి విచార‌ణ చేప‌డ‌తామ‌ని నందిగామ ఆర్టీవో(RDO) బాల‌కృష్ణ తెలిపారు. గురువారం రాత్రి కొంద‌రు ఆఫీస్ వ‌ద్ద చ‌లిమంట‌లు వేసుకున్న‌ట్లు స్థానికులు చెప్తున్నారు. కాగా, ఏపీలో ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో వ‌రుసగా అగ్నిప్ర‌మాదాలు((Fire Accident)) చోటుచేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>