కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ల్యాండ్‌మార్క్ 20వ చిత్రం స్వయంభు (Swayambhu) ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ఇప్పటికే బలమైన బజ్‌ను క్రియేట్ చేసింది. స్వయంభూ టైటిల్, అందుకు సంబంధించిన వీడియో భారీ అంచనాలను పెంచేసింది. సంక్రాంతి సందర్భంగా గురువారం మేకర్స్ పండుగ వైబ్స్ తెచ్చే ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్ రాత్రిపూట అందంగా కనిపించాడు. ఆలయం ముందు తన బృందంతో కలిసి ఎనర్జిటిక్‌గా డాన్స్ చేస్తున్నట్లు చూడొచ్చు.
పూర్తిగా పండుగ (Festival) వాతావరణంతో పోస్టర్ గ్రాండ్‌గా ఉంది. ఇది ఇతిహాసం, చారిత్రక మూడ్‌ను తెలియజేస్తోంది. ఈ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించగా, సంయుక్త, నభా నటేష్ మహిళా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో నిఖిల్ (Nikhil) యోధుడి పాత్రను పోషిస్తున్నాడు. స్వయంభు ఫిబ్రవరి 13న మహా శివరాత్రి సందర్భంగా విడుదల కానుంది.


