కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో కామన్ వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సు రెండో రోజు జరుగుతోంది. ఈ సదస్సుకు వచ్చిన వివిధ దేశాల స్పీకర్లకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కామన్ వెల్త్ దేశాల అభివృద్ధి గణనీయంగా పెరుగుతోందన్నారు. ప్రపంచంలోనే భారత్ మరింత శక్తివంతంగా మారుతోందని.. దీనికి కామన్ వెల్త్ దేశాల సహకారం ఎంతో ముఖ్యం అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో స్పీకర్లదే గొప్ప పాత్ర అని.. అలాంటి స్పీకర్లకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉండకపోయినా.. వాళ్లే ఎక్కువ సమస్యలు వింటారని వివరించారు ప్రధాని మోడీ.
ఢిల్లీలో ఈ సదస్సు జరుగుతున్న బిల్డింగ్ లోనే ఎన్నో ప్రపంచ స్థాయి చర్చలు జరిగాయని.. అందుకే ఈ బిల్డింగ్ కు ‘సంవిధాన్ సదన్‘ అని పేరు మార్చినట్టు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స్పష్టం చేశారు. ఈ సదస్సుకు మొత్తం 56 దేశాల నుంచి 42 మంది ప్రతినిధులు హాజరయ్యరు. బంగ్లాదేశ్ పార్లమెంట్ సస్పెన్షన్ లో ఉన్నందున అక్కడి నుంచి ఎవరూ రాలేదు. ఇక పాకిస్థాన్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. రేపు కూడా సమావేశాలు కొనసాగనున్నాయి.


