epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కల్కి 2 షూటింగ్ ప్రారంభమయ్యేది అప్పుడేనా!

కలం, వెబ్​ డెస్క్​ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ “రాజాసాబ్” ఈ నెల 9న పాన్ ఇండియా వైడ్ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది..ఇదిలా వుంటే ప్రభాస్ వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ప్రభాస్ లైనప్ లో కల్కి 2, ఫౌజీ, స్పిరిట్ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న “ఫౌజీ ” మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అలాగే కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “స్పిరిట్” షూటింగ్ కూడా తాజాగా మొదలైంది.. రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసిన “స్పిరిట్” పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. అయితే గత ఏడాది రిలీజ్ అయి ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన “కల్కి” సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ , స్పిరిట్ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు.. అయితే తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి నుంచి కల్కి పార్ట్ 2 షూటింగ్ కోసం ప్రభాస్ కొన్ని డేట్స్ కేటాయిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ పార్ట్ 2 కి సంబంధించి కొన్ని సీన్స్ ఆల్రెడీ పార్ట్ 1 సమయంలోనే తెరకెక్కించినట్లు సమాచారం.

మిగతా పార్ట్ షూటింగ్ కూడా ప్రభాస్ డేట్స్ బేస్ చేసుకొని పూర్తి చేయనున్నారు ..అయితే కల్కి పార్ట్ 2 మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం బాగా సమయం పట్టే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.కానీ ఒకేసారి మూడు సినిమాల షూటింగ్స్ ప్రభాస్ ఎలా మ్యానేజే చేస్తాడనేదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. మూడు సినిమాల లుక్స్ కూడా డిఫరెంట్ గా వుండటంతో ప్రభాస్ డేట్స్ మీదనే కల్కి పార్ట్ 2 షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తుంది..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>