విషాదం.. పెళ్లై నెల రోజులు కాకముందే నవవధువు ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా కల్లేడి (Kalledi) గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లై నెల రోజులు కూడా కాకముందే నవవధువు అఖిల (Akhila suicide) ఆత్మహత్య చేసుకుంది. కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు తనువు చలించడంతో ఆ గ్రామంలో చీకటి అలుముకుంది. బాన్సువాడకు చెందిన అఖిలతో మార్చి 5న శ్రీకాంత్‌తో వివాహం జరిగింది. శుక్రవారం బాన్సువాడ నుంచి బయల్దేరిన అఖిల అత్తగారింటికి చేరుకుంది. ఏమైందో ఏమో తెలియదు గానీ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త శ్రీకాంత్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ బలవర్మరణానికి పాల్పడింది. అఖిల మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘అమ్మా.. అఖిలా మమ్మల్ని విడిచి వెళ్లిపోయావమ్మా’ అంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అఖిల ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>