Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్ దేవరకొండతో ఫస్ట్ కిస్.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ గీత గోవిందం సినిమా అప్పట్లో సంచలనం. అయితే ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒక సన్నివేశం మాత్రం రష్మికకు పెద్ద సవాలుగా మారిందట. విజయ్ దేవరకొండతో చేసిన మొదటి ఆన్ స్క్రీన్ కిస్సింగ్ సీన్ గురించి రష్మిక గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన వ్యక్తిగత అనుభూతులను పంచుకుంటూ ‘నాకు ముద్దు (Kiss) అనేది వ్యక్తిగతమైన విషయం. అలాంటిది సుమారు 200 మంది చూస్తుండగా ఆ సన్నివేశంలో నటించడం  ఇబ్బందిగా అనిపించింది’ అని రష్మిక పేర్కొన్నారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. ఎలా నటించాలో తెలియక ఒత్తిడికి లోనయ్యానని వివరించారు. కేవలం తనకే కాకుండా, తన కో-స్టార్ విజయ్ దేవరకొండ కూడా అదే విధమైన ఇబ్బందిని ఎదుర్కొన్నాడని రష్మిక రివీల్ చేశారు.

తొలిసారిగా అంతగా పరిచయం వ్యక్తుల మధ్య సన్నిహితంగా నటించడం చాలా కష్టమని చెప్పింది. అది కేవలం నటన మాత్రమే అయినప్పటికీ మహిళగా ‘షాకింగ్’ అనుభవమని తెలిపారు. అయితే ఆ సన్నివేశం సినిమాకు హైలైట్ కాబట్టి, వృత్తిపరంగా పూర్తి చేశామని చెప్పారు. ప్రస్తుతం ఈ జంట నిజ జీవితంలోనూ వివాహ బంధంతో ఒకటి కావడంతో అభిమానుల్లోనూ ఆనందం నింపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>