Mobile Popup Ad
Mobile Popup Ad

చెత్త‌కుప్ప‌లో ప‌సికందు.. స‌త్య‌సాయి జిల్లాలో అమానుషం

క‌లం, వెబ్ డెస్క్‌: శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District)లో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ ప‌సికందు (Newborn)ను గుర్తు తెలియ‌ని మ‌హిళ‌ చెత్త‌కుప్ప‌లో ప‌డేసి వెళ్లిపోయింది. సోమందేపల్లి మండలం నడింపల్లిలో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది. పిల్లాడి ఏడుపులు విన్న స్థానికులు చెత్త కుప్ప ద‌గ్గ‌రికి వెళ్లి చూశారు. అదృష్టవ‌శాత్తు వీధి కుక్క‌లు అటు వైపు రాలేదు. స్థానికులు చుట్టు ప‌క్క‌ల గ‌మ‌నించారు. ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆశా వర్కర్ సాయంతో ప‌సి బాలుడిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం బాబును ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. బాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బిడ్డ‌ను చెత్త‌కుప్ప‌లో ఎవ‌రు వేశార‌న్న దానిపై విచార‌ణ జ‌రుగుతోంది.

Read Also: బ్లూజెట్ ఫార్మా ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>