కలం, స్పోర్ట్స్: భారత్, న్యూజిలాండ్ (New Zealand) మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ కీలక మలుపు తీసుకుంది. న్యూజిలాండ్ తొలుత నిలకడగా రాణించినా.. ఒక్కసారిగా వికెట్ల పరంపర షురూ అయింది. 21వ ఓవర్లో స్టార్ట్ అయిన వికెట్ల పరంపర 28 ఓవర్లకు 3కి చేరింది. నిలకడగా రాణించిన ఓపెనర్స్ ఇద్దరిని భారత బౌలర్లు ఔట్ చేశారు. 21.4 ఓవర్ల దగ్గర నికోల్స్‌ను హర్షిత్ రాణా ఔట్ చేశారు. హర్షిత్ రాణా వేసిన స్లో బాల్ ఎడ్జ్ కట్ అయి క్యాచ్‌గా మారింది. ఎడ్జ్ కట్ అయి గాలిలోకి ఎగిరిన బంతిని వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టారు. దీంతో 65 బంతులకు 54 పరుగులు చేసిన నికోల్స్ పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత 23.6 ఓవర్ల దగ్గర కాన్‌వే ఔట్ అయ్యాడు. హర్షిత్ రాణా వేసిన బాల్ ఇన్‌సైడ్ ఎడ్జ్ అయి స్టంప్స్‌ను తాకింది. దీంతో 56 పరుగుల దగ్గర కాన్వే డెవోన్ ఔట్ అయ్యాడు. ఆఖరుగా 27వ ఓవర్ ఆఖరు బాల్‌కు విల్ యంగ్‌ను సిరాజ్ ఐట్ చేశాడు. విల్ యంగ్ కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ (New Zealand) ఇబ్బందుల్లో పడింది.
ప్రస్తుతం క్రీజ్‌లో డారిల్ మిఛెల్, విల్ యంగ్ ఉన్నారు. మిఛెల్ 14 బంతులకు 11 పరుగులు చేయగా, విల్ యంగ్ 15 బంతుల్లో 12 పరుగులు చేశాడు. ప్రస్తుతం సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. సిరాజ్ తన ఓవర్లో కేవలం ఒక్క పరుగే ఇచ్చి ప్రత్యర్థులను కట్టడి చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 27.4 ఓవర్లకు గాను 146/3 స్కోర్ చేసింది.

Read Also: డబ్ల్యూపీఎల్‌కు యాస్తికా భాటియా దూరం.. అదే కారణం !
Follow Us On: Instagram


