కలం, వెబ్ డెస్క్ : ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas Fans) డైరెక్టర్ హను రాఘవపూడికి (Hanu Raghavapudi) స్పెషల్ రిక్వెస్ట్ చేస్తూ నోట్ రాశారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను డైరెక్షన్ లో ఫౌజీ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. దీని గురించి వాళ్లు రాసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే.. ‘డైరెక్టర్ హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ ఫౌజీ విషయంలో హై క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండేలా చూడాలి. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. వీఎఫ్ ఎక్స్ క్వాలిటీగా ఉండాలి. మంచి ఎమోషన్లు, కట్టిపడేసే లవ్ సీన్లు, ఇంట్రో, ఇంటర్వెల్, క్లైమాక్స్ గుర్తుండిపోయేలా ఉండాలి’ అని ప్రభాస్ ఫ్యాన్స్ కోరారు.
ఫౌజీ సినిమా ప్రభాస్ లెవల్లో ఉండాలని.. లేదంటే తాము ఒప్పుకునేది లేదంటున్నారు ఫ్యాన్స్. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ మంచి ట్యూన్స్, సాంగ్స్ అందించాలని.. బీజీఎం అదిరిపోవాలని ఆ నోట్ లో తెలిపారు. పాటల రచయిత కృష్ణ కాంత్ రాధేశ్యామ్ సినిమాకు మంచి డెప్త్ ఉన్న సాంగ్స్ రాశాడని.. ఈ ఫౌజీ మూవీకి కూడా అలాంటి సాంగ్స్ ఉండాలని కోరారు ప్రభాస్ ఫ్యాన్స్. సెన్సార్ బోర్డుకు టైమ్ కంటే ముందే మూవీని పంపాలని.. ఎలాంటి రిలీజ్ ఇష్యూస్ రాకుండా, అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సమస్యలు రాకుండా చూడాలని రెబల్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేశారు. ది రాజాసాబ్ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఇలా నోట్ రాసినట్టు తెలుస్తోంది. మరి దీనిపై ఫౌజీ టీమ్ ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

Read Also: ఆకట్టుకుంటున్న సమంత ‘బాపు బొమ్మ సిరీస్’
Follow Us On: X(Twitter)


