కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ విజన్ 2047 రూపకల్పన చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) తెలిపారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ లతో కలిసి భట్టి ఆదివారం గోదావరిఖనిలో పర్యటించి. రామగుండం కార్పోరేషన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భట్టి పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇస్తుందని, ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు భట్టి వెల్లడించారు. అలాగే, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

Read Also: సంక్రాంతికి బస్సుల జాతర..
Follow Us On: Sharechat


