కలం, వెబ్‌డెస్క్: భారత్‌తో సహా వందలాది దేశాలు ఇంకా ఎదురుచూస్తుండగానే అటు న్యూజిలాండ్ కొత్త సంవత్సరానికి (New Year 2026) ఘనంగా స్వాగతం పలికింది. ఆ దేశంలోని ప్రజలు కేరింతలు కొడుతూ, బాణ సంచా పేలుస్తూ, కేకులు కట్ చేస్తూ కొత్త ఏడాదిని ఘనంగా స్వాగతించారు. రాజధాని వెల్లింగ్టన్తోపాటు ఆక్లాండ్, క్రైస్ట్‌చర్చ్, హామిల్టన్ తదితర నగరాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆకట్టుకున్నాయి. భౌగోళికంగా తూర్పు వైపున ఉన్న మొదటి దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. దీనితోపాటు సమోవా, తువాలు, టోంగా తదితర చిన్న ద్వీప దేశాల్లోనూ న్యూ ఇయర్ ప్రారంభమైంది. కివీస్‌లో న్యూ ఇయర్ సంబరాలు మొదలైన కాసేపటికే ఆస్ట్రేలియాలోనూ ప్రారంభమయ్యాయి. సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా తదితర నగరాల్లో ఫైర్ వర్క్స్ మిరుమిట్లు గొలిపాయి. వేడుకలు అంబరాన్నంటేలా జరుగుతున్నాయి.
Read Also: ఖలీదా జియా అంత్యక్రియలు.. హాజరైన జైశంకర్
Follow Us On: X(Twitter)


