కలం, వెబ్ డెస్క్ : గిగ్ వర్కర్లు దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తుండటంతో జొమాటో, స్విగ్గీ (Zomato – Swiggy) దిగి వచ్చాయి. డిసెంబర్ 31న పెద్ద ఎత్తున ఆర్డర్లు ఉంటాయి కాబట్టి గిగ్ వర్కర్లకు భారీగా ఇన్సెంటివ్ లు ప్రకటించాయి జొమాటో సంస్థ నేడు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రతి ఆర్డర్ మీద రూ.120 నుంచి రూ.150 వరకు ఇన్సెంటివ్ లు ఇస్తామని ప్రకటించింది. ఆర్డర్ ల విలువ, కార్మికుల లభ్యతను బట్టి ఈ ఒక్కరోజే రూ.3 వేల దాకా సంపాదించుకునే వెసలుబాటు కల్పిస్తామని తెలిపింది జొమాటో.
అటు స్విగ్గీ కూడా డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేసే కార్మికులకు రూ.2వేల పేమెంట్ ఆఫర్ ఇచ్చింది. డిసెంబర్ 30, 31, 1వ తేదీల్లో కలిపి పార్ట్ నర్ షిప్ లో కార్మికులు రూ.10వేల దాకా సంపాదించుకునే వెసలుబాటును కల్పించింది. కాకపోతే ఇది పర్మినెంట్ కాదని సంస్థలు తెలిపాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలని గిగ్ వర్కర్లు (Zomato – Swiggy) కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. మొన్న క్రిస్మస్ రోజున చాలా చోట్ల గిగ్ వర్కర్లు సమ్మె నిర్వహించారు. కానీ దానిపై ఈ కామర్స్ సంస్థలు పెద్దగా స్పందించలేదు. నేడు న్యూ ఇయర్ సందర్భంగా మరోసారి గిగ్ వర్కర్లు పెద్ద ఎత్తున సమ్మె చేయడంతో తాత్కాళికంగా ఈ ఆఫర్లు ప్రకటించాయి సంస్థలు. మరి వారి సమ్మె రాబోయే రోజుల్లో కూడా ఉంటుందా లేదా అనేది తెలియాలి.
Read Also: జీహెచ్ఎంసీలో భారీ బదిలీలు.. ఒకేసారి 140 మంది ట్రాన్స్ ఫర్
Follow Us On: Instagram


