కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో (Moinabad) అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. అయితే తాము గ్రామాల్లో భూములు అమ్మి ఆ డబ్బుతో ఇక్కడ ప్లాట్లు కొన్నామని బాధితులు చెబుతున్నారు. గడ్డ కట్టే చలిలో తమ సామాగ్రి మొత్తం బయటపడేసి నిరాశ్రయులను చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
మొయినాబాద్ (Moinabad) మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూలో 210, 211, 212 సర్వే నంబర్లలోని 16 ఎకరాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 50 మంది గిరిజన కుటుంబాలు ప్లాట్లు కొనుగోలు చేశాయి. తాము గ్రామాల్లో పొలాలు అమ్మి ఇక్కడ స్థలాలు కొనుగోలు చేశామని బాధితులు చెబుతున్నారు. తాము కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు.
ఎలాంటి సమాచారం, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లతో, భారీ పోలీసు బందోబస్తు మధ్య పోలీసులు ఇండ్లు కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. తెల్లవారుజామునే నిద్ర నుంచి లేపి ఇండ్ల నుంచి బయటికి గెంటేసి అక్రమ నిర్మాణాలంటూ బుల్డోజర్లతో కూల్చివేశారని.. సామాన్లు కూడా తీసుకోనివ్వకుండా గెంటేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ 16 ఎకరాల్లో చేపట్టిన నిర్మాణాలు అక్రమమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
Read Also: హాస్టల్ బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా.. ప్రేమ జంట అరెస్ట్
Follow Us On: Youtube


