కలం, చంద్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ (Chandrugonda) గ్రామపంచాయతీ పరిధిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా వీధి వీధికీ నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను ఆదివారం చేపట్టారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహకారంతో చేపట్టిన ఈ పనులను సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి, ఉప సర్పంచ్ అంతటి రామకృష్ణ దగ్గరుండి పర్యవేక్షించారు.
గ్రామంలో విద్యుత్ లీకేజీలు, లో-వోల్టేజీ సమస్యలను అధిగమించి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మలపల్లి సురేష్, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు, పాలకవర్గానికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

