ఏపీలో కలకలం.. బోటులో నాలుగు మృతదేహాలు

కలం, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్‌ (Kothapatnam Beach)లోని ఒక బోటులో నాలుగు మృతదేహాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇదే బోటులో మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. వీరంతా చెన్నైకి చెందినవారిగా గుర్తించారు. ఇటీవల వరుసగా తుఫాన్లు వచ్చిన నేపథ్యంలో చేపల వేట కోసం వెళ్లి.. దారి తప్పిన బోటు కొత్తపట్నం తీరానికి కొట్టుకుని వచ్చినట్లు పేర్కొన్నారు. మృతదేహాల గురించి బోటులోని వ్యక్తులను ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>