అనారోగ్య బాధిత కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ భరోసా

కలం, సోన్: సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడు(Left Pochampad) గ్రామానికి చెందిన దండగుల వర్షిని అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) నుంచి మంజూరైన రూ.లక్ష ఎల్‌ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti) ఆదివారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్  ఎంతో ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం పొందలేని పేదలకు సీఎంఆర్‌ఎఫ్  ద్వారా సాయం అందుతుందని తెలిపారు. వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>