అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. నగదు, సొత్తు సీజ్

కలం, నిజామాబాద్ బ్యూరో: పగటిపూట ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా (Theft Gang) ను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన సయ్యద్ షకీల్, షేక్ అహ్మద్, షేక్ ఇమ్రాన్ ముఠాగా ఏర్పడి అక్టోబర్ 4వ తేదీన నిజామాబాద్ (Nizamabad) జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ నవీదుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. పట్టపగలు ఇంటి తాళాన్ని పగులగొట్టి చోరీ చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఏసీపీ ప్రకాశ్ యాదవ్, ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడిన వారిని నవీపేట (Navipet) సమీపంలో పట్టుకున్నారు. నిందితులు నిజామాబాద్‌‌తో పాటు కామారెడ్డి, నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్లు సీపీ సాయి చైతన్య వివరించారు. కర్నాటకలోని యాద్గిర్‌లో కూడా వీరిపై చోరీ కేసులు ఉన్నాయన్నారు.

ముఠా(Theft Gang)లోని ప్రధాన నిందితుడు సయ్యద్ షకిల్ హోండా సిటీ కారు తీసుకొని దానికి నకిలీ నంబర్ పేట్లను తయారు చేసి చోరీలకు పాల్పడుతున్న సమయంలో వినియోగిస్తున్నట్లు తెలిపారు. షకిల్ ఒక్కడే ఇళ్లలోకి వెళ్లి చోరీ చేస్తే.. మిగతా ఇద్దరు చుట్టు పక్కల గమనిస్తూ ఉంటారని సీపీ చెప్పారు. చోరీలకు ఉపయోగించిన కారుతో పాటు నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నామని ఆయన వెల్లడించారు.

Also Read : నల్లగొండ కార్పొరేషన్‌లో ‘ఇంటి దొంగలు’!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>