Mobile Popup Ad
Mobile Popup Ad

కామారెడ్డిలో ఘోరం.. ఇసుక కుప్పలో పసికందు మృతదేహం

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఇసుక కుప్పలో రెండు రోజుల వయసు గల పసికందు మృతదేహం బయటపడటం కలకలం రేపింది. పట్టణంలోని ముషీర్ భాగ్ సమీపంలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిందని వదిలేసి వెళ్లారా.. లేదా.. మరేదైనా కోణం ఉందా.. అని ఆరా తీస్తున్నారు. ఒకవేళ కడుపులోనే చనిపోతే కూడా పూడ్చి పెట్టడం.. లేదా ఆసుపత్రి వర్గాలకు చెబితే మున్సిపాలిటీ ద్వారా ఏర్పాట్లు చేస్తారు. కానీ, పట్టణానికి దూరంగా ఇసుకలో పారేసే మనసు ఎలా వచ్చింది.. ఇలా అనేక కోణాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటు వైపుగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>